Inter Exams | నల్లగొండలో ఐదుగురిని ఇంటర్ పరీక్షలకు అనుమతించని అధికారులు
Inter Exams | ఇంటర్ పరీక్షల్లో(Inter Exams) నిమిషం ఆలస్యమైతే పరీక్ష రాయనివ్వమనే నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల్లో(Inter Exams) నిమిషం ఆలస్యమైతే పరీక్ష రాయనివ్వమనే నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నల్లగొండ(Nalgonda) జిల్లాలో పరీక్షకు ఆలస్యంగా వచ్చారని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురు విద్యార్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు విషాదంతో వెనుదిరిగారు. నిమిషం నిబంధన వల్ల తమ జీవితాల్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి నిబంధనలు ఎత్తేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి మొత్తం 9,80,978 మంది పరీక్షలు రాస్తున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,78,718 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,02,260 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఈ పరీక్షల కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అధి కారులు అనుమతించడంలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

