ఖైరతాబాద్, జూలై 8 : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతికి కారకులైన అధికారులు, సిబ్బందిని వెంటనే బర్తరఫ్ చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు డిమాండ్ చేశారు. నవీన్నగర్లోని మాలమహానాడు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఎస్సై స్థాయికి ఎదిగారని చెప్పారు. అశ్వారావుపేటలో విధులు నిర్వహిస్తుండగా, సీఐ జితేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆయన మృతితో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు పెద్ద దిక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ మృతికి కారకులైన అధికారులు, సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్లు వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. శ్రీనివాస్ మృతికి కారకులను సర్వీస్ నుంచి తొలగించాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ రాంచందర్ డిమాండ్ చేశారు. మింట్ కాంపౌండ్‌లో శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించారు. బాలకిషన్, వెంకన్న, కాశీనాథ్, అచ్యుతయ్య, కృష్ణ, రమేశ్, శంకర్, సంఘయ్య, మల్లేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.