హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ) : నర్సింగ్ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగోన్నతుల్లో మేల్ నర్సింగ్ ఆఫీసర్లపై కాం గ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎంఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన నర్సింగ్ ఆఫీసర్లు లెక్చరర్ పోస్టులకు అర్హులు. రెండు మల్టీజోన్ల పరిధిలోని నర్సింగ్ కాలేజీల్లో మొత్తం 338 నర్సింగ్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీజోన్-1లో 167 నర్సింగ్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండగా.. 115 మంది ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్లు అర్హులుగా ఉన్నారు. మల్టీజోన్-2 లో 171 పోస్టులకు 118 మంది ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్లు అర్హులుగా ఉన్నారు. రెండు మల్టీజోన్ల పరిధిలో అర్హులందరినీ కలిపినా.. ఇంకా 105 పోస్టులు ఖాళీగానే ఉన్నాయని మేల్ నర్సింగ్ ఆఫీసర్లు చెబుతున్నారు. రెండు మల్టీజోన్ల పరిధిలో 19 మంది మేల్ నర్సింగ్ ఆఫీసర్లు లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో తెలెత్తిన వివాదం ముదిరి పాకానపడుతున్నది. ప్రైవేట్ విద్యా సంస్థలు 2026-2027 విద్యాసంవత్స రం ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఫీ జు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు లో జరుగుతున్న జాప్యంపై పలు కాలేజీ లు హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. కానీ, ఈ ఉత్తర్వులు తాత్కాలికమేనని, బకాయిలు చెల్లించాలన్న పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తుది తీర్పు విద్యాసంస్థలకు ప్రతికూలంగా వెలువడిన పక్షంలో ఫీజులను తిరిగి చెల్లించాలని షరతు విధిస్తూ.. తదుపరి విచారణను 30కి వాయిదా వేశారు.