హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను బుధవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రతి అభ్యర్థి వివరాలతోపాటు వారికి వచ్చిన మార్కులను వెబ్సైట్లో ఉంచారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ద్వారా వాటిని తెలుపుకోవడానికి ఈనెల 26నుంచి సెప్టెంబర్ 2వరకు గడువు విధించారు. వైద్యారోగ్యశాఖలో 2322 నర్సింగ్ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ 23న సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 40,243 మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు తెలిపారు.