వరంగల్ చౌరస్తా, ఏప్రిల్2: కాకతీయ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన వైద్య విద్యాబోధకుల నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 52 పోస్టులు భర్తీ చేయనున్నమని, వాటిలో ప్రొఫెసర్ పోస్టులు 7, అసోసియేట్ ప్రొఫెసర్లు 18, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 23, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 22 మందిని నియమించనున్నట్లు తెలిపారు.
అనుభవం కలిగిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవడానికి కేఎంసీ వెబ్సైట్ WWW.kmc.wgl.com నందు పూర్తి సమాచారం పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తుదారులు ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూకు పూర్తి ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.