హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో సమాచార ప్రసార శాఖ (హైదరాబాద్)లో రెండేండ్ల కాల వ్యవధిలో ట్రాన్స్లేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం పీఐబీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్ (ఇంగ్లిష్ నుంచి తెలుగు) పోస్టులతోపాటు తెలుగు భాషా నిపుణులు, తెలుగు టైపిస్టు ఎంప్యానల్మెంట్ కోసం కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం http://pib.gov.in/ indexed.aspxను సంప్రదించాలని సూచించారు.