Health Tips | నోటి దుర్వాసన నలుగుట్లో ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Health Tips | నోటి దుర్వాసన (Bad Breath) తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నలుగుట్లో మాట్లాడాలంటే నమోషీగా ఉంటుంది. మన నోటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా ఎదుటివాళ్లు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. జీర్ణకోశం బలంగా లేకపోతే నోటి దుర్వాసన అధికంగా వుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
Health Tips : నోటి దుర్వాసన (Bad Breath) తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నలుగుట్లో మాట్లాడాలంటే నమోషీగా ఉంటుంది. మన నోటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా ఎదుటివాళ్లు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. జీర్ణకోశం బలంగా లేకపోతే నోటి దుర్వాసన అధికంగా వుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. కొబ్బరిపాల (కొబ్బరిని కోరి మెత్తగా రుబ్బి పిండితే వచ్చే రసం) లో తగినంత పచ్చ కర్పూరం వేసుకొని తాగాలి. ఈ కొబ్బరి పాలను పచ్చిగా అయినా తాగవచ్చు, వేడి చేసుకుని అయినా తాగవచ్చు. ఇలా తరచూ చేయడంవల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
2. అదేవిధంగా గజ నిమ్మకాయ (దబ్బ నిమ్మకాయ) ను ముందు నాలుగు ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత దాన్ని చిన్న ముక్కులుగా తరుగుకుని, ఒక్కో ముక్కను దవడకు వేసుకుని చప్పరిస్తే నోరు శుభ్రపడుతుంది. తద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది.
3. జాజికాయ, జాపత్రీ, పచ్చ కర్పూరం కొద్దికొద్దిగా తీసుకొని దంచుకోవాలి. అనంతరం ఆ పొడిని ఎండుద్రాక్షలతో కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న గోళీల్లా చుట్టుకుని, ఒక్కో గోళిని దవడకు పెట్టుకొని చప్పరిస్తుండాలి. దాంతో క్రమంగా నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. తరచూ దాల్చిన చెక్క చిన్నముక్కను తీసుకుని దవడకు పెట్టుకుని నములుతుంటే కూడా నోరు శుభ్రంగా పడుతుంది. ఫలితంగా నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది.
5. తమలపాకులు కూడా నోటి దుర్వాసనను పోగొట్టడంలో తోడ్పడుతాయి. ఇవి నాలుకమీద జిగురును హరిస్తాయి. తమలపాకుపై పచ్చకర్పూరం వేసిన కిళ్లీ తింటే నోటిలో మంచి సువాసన వస్తుంది. దాంతో నోటి దుర్వాసన తగ్గుతుంది.
6. అంతేగాక ఏలకులు, లవంగం కూడా నోటి దుర్వాసనని తగ్గిస్తాయి. కాబట్టి తరచూ ఏలకులు గానీ, లవంగాలు గానీ నోట్లో వేసుకోవాలి. ముఖ్యంగా నలుగుట్లోకి వెళ్లేటప్పుడు ఇలా చేయడంవల్ల నోటి దుర్వాసనవల్ల కలిగే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

