మహబూబ్నగర్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 25 : మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను నిర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ, నీటిపారుదలశాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వే ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.
బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండే ఇండ్లకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఇండ్ల యజమానులు ఇంటి నిర్మాణాలకు సంబంధించి నీటిపారుదల శాఖ ఇచ్చిన ఎన్వోసీ, మున్సిపల్ అనుమతుల డాక్యుమెంట్లు వారం రోజుల్లో సమర్పించాలని కోరినట్టు వెల్లడించారు.