హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈశాన్య రుతుపవనాల ఆగమనం ప్రారంభమైనట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే వీటి ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఆగ్నేయం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఈ ప్రభావం ఏపీ, తెలంగాణలపై ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. రాగల మూడు రోజుల పాటు కొన్నిచోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న తుఫానుకు ‘తేజ్’గా నామకరణం చేశారు.