ఎంసెట్ ఫలితాల్లో నార్మలైజేషన్

- పేపర్ కఠినంగా వచ్చిన వారికి ప్లస్ మార్కులు
- ఈజీగా వచ్చినవారికి మార్కుల్లో కోతలు
- 25వ తేదీన ప్రకటించే ర్యాంకులే ఫైనల్
- వాటి ఆధారంగానే ఇంజినీరింగ్ ప్రవేశాలు
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్న ఎంసెట్ (ఇంజినీరింగ్) ఫలితాలు, ర్యాంకుల ఖరారులో నార్మలైజేషన్ ప్రక్రియను అమలుచేయనున్నారు. కఠినమైన ప్రశ్నాపత్రం వచ్చిన అభ్యర్థులకు మార్కులు కలపడం, ఈజీ పేపర్ వచ్చినవారి మార్కుల్లో కోత విధించడాన్నే నార్మలైజేషన్ అంటారు. ఈ ఏడాది ఎంసెట్‌ను ఆరు సెషన్లలో నిర్వహించారు. ఒక సెషన్లో ఈజీ పేపర్, మరో సెషన్లో హార్డ్ పేపర్ వ్యత్యాసాల కారణంగా విద్యార్థులెవరూ నష్టపోకుండా నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. కఠినమైన, సులభమైన ప్రశ్నాపత్రాలను నిర్ధారించేందుకు నిపుణుల కమిటీని నియమించారు. దీని సూచనల ఆధారంగా జేఎన్టీయూ అధికారులు ఇప్పటికే నార్మలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్టు సమాచారం. ఇది అత్యంత గోప్యంగా జరిగే వ్యవహారమని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ పద్ధతి రద్దు చేసినందున 25న ప్రకటించే ర్యాంకులే తుది ఫలితాలు కానున్నాయి. ఆయా ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- emcet
- normalization
- results
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

