హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డులు-2024 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడ లు, సాంస్కృతిక విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన సంస్థలు, సొసైటీలు ఈ నెల 23 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన సంస్థలకు పు రస్కారం కింద రూ. 2 లక్షలు, ప్రశంసాపత్రం అందజేయనున్నారని వెల్లడించారు. ఆసక్తిగల ఆర్గనైజేషన్లు governor .telangana.govt.in, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్‌భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ 500041లో దరఖాస్తులు అందజేయాలని కోరారు.