Beers | తెలంగాణలో బీర్ల కొరత లేదని.. కేవలం కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప.. మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలు ఉన్నాయని.. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసెన్స్‌లు షరతుల ప్రకారమే.. ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుందని పేర్కొంది.
సాధారణంగా ఒక షిప్టుకు అనుమతి ఉంటుందని.. కానీ, డిమాండ్ మేరకు బ్రూవరీస్ అభ్యర్థతనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుం చెల్లించిన వారికి మూడు షిప్టులకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. ఆరు బ్రూవరీస్లో నాలుగు బ్రూవరీస్ 95శాతం వారి డిమాండ్ కలిగిన బ్రాండ్స్ చేస్తాయని పేర్కొంది. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే నాలుగు కంపెనీలకు మూడు షిప్టులకు అనుమతి తీసుకున్నారని చెప్పింది.
డిమాండ్ ఉన్న నాలుగు కంపెనీల రోజువారి ఉత్పత్తి సామర్థ్యం 1.66లక్షల కేసులని.. మూడు షిప్టుల్లో 4.98లక్షలు కేసులు తయారు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కానీ, మూడు షిప్టులు నడిపేందుకు అనుమతి తీసుకున్న కంపెనీలు మూడు షిప్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేశాయని తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2లక్షల కేసులు జరుగుతాయని చెప్పింది. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రెవరీస్ కార్పొరేషన్ డిపోల్లో బ్రూవరీస్లో నిల్వలు ఉన్నాయని పేర్కొంది. బీర్ల కొరత లేదని.. మూడు షిఫ్టుల్లో అనుమతి తీసుకున్న కంపెనీలు తగింత ఉత్పత్తి చేయకపోవడంతో బీరు కొరత ఏర్పడిందని చెప్పింది.
ఎక్సైజ్ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చర్యలు తీసుకుంటుందని.. నిల్వలకు కొరత లేకుండా చూస్తున్నామని వివరించింది. ఇక తెలంగాణలో కొత్త బ్రాండ్ల అనుమతికి సంబంధించి గతంలో నుంచి కొనసాగుతున్న పద్ధతినే కొనసాగిస్తున్నామని.. కొత్త సంస్థలు తమ బ్రాండ్స్‌ను తెలంగాణ బేవరీజెస్ కార్పొరేషన్‌కు సరఫరా చేయడానికి నిబంధనలకు కట్టుబడి ఉంటామన్న వారికే అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. గత ఐదేళ్లలో తెలంగాణలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. గడిచిన ఐదు నెల్లలో నాలుగు బీరు బ్రాండ్స్‌ను సరఫరా చేసేందుకు కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించింది.