హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): సినీనటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డికి గాంధీభవన్‌లో అవమానం జరిగినట్టు తెలుస్తున్నది. సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ నడుస్తున్న పరిస్థితుల్లో చంద్రశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌కు వెళ్లడం, ఆయనతో మాట్లాడేందుకు దీపాదాస్ మున్షీ నిరాకరించడం చర్చనీయాంశంగా మారాయి. మున్షీ చాంబర్లోకి వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె నిలబడి ఇక వెళ్లిపోదాం అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్లారు. చంద్రశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చిన సంగతే తెలియదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను చెప్పారు.