Nizam College | సుల్తాన్ బజార్,మార్చి 7 : 138 ఏండ్ల చరిత్ర కలిగిన నిజం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ వరించింది. ఈ మేరకు శుక్రవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మెయిల్ ద్వారా కళాశాలకు ఏ గ్రేడ్‌ను ప్రకటించింది. దీంతో కళాశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ మాట్లాడుతూ.. కళాశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది సమిష్టి కృషితోనే కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ వరించిందన్నారు. కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహంతో అకాడమిక్ను అభివృద్ధి పరచడంతో పాటు మౌలిక వసతులను మరింత పెంపొందిస్తామని తెలిపారు. 138 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం కళాశాలకు ప్రస్తుతం బి ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉండేదని అన్నారు. కళాశాల మొత్తంలో కేవలం 14 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీలతో కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సాధించడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్‌ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ వచ్చిందని తెలిపారు. దీంతో వీసీ ప్రిన్సిపాల్ ఏవి రాజశేఖర్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రేణుక, ప్రొఫెసర్ అబ్కా నాగేశ్వరరావు, డాక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.