హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎన్సీఈఆర్టీ అమలుచేస్తున్న నిశిత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 2023- 24 విద్యాసంవత్సరానికి నిశిత 3.0 (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ), నిశిత 4.0 (ఈసీసీఈ) కోర్సుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు.
2024 మార్చి1లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.