రాజన్న ఆలయ అధికారులకు నోటీసులు!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి లీజులు, లైసెన్స్‌ల జారీలో లోటుపాట్లు, శాఖాపరమైన తప్పిదాలపై ఆ విభాగానికి చెందిన తొమ్మిది మంది అధికారులు, ఉద్యోగులకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెం ట్ తాజాగా నోటీసులు జారీ చేసినట్టు తెలిసిం ది. వేములవాడ భీమేశ్వరాలయంలో ఆగస్టు 17న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం తొమ్మిది గంటలపాటు విస్తృత తనిఖీలు చేసి, పలు తప్పిదాలను గుర్తించి, రికార్డులను స్వా ధీనం చేసుకున్నది.
- లీజు, లైసెన్స్‌ల జారీలో తప్పిదాలే కారణం
- వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం
వేములవాడ, అక్టోబర్ 21: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి లీజులు, లైసెన్స్‌ల జారీలో లోటుపాట్లు, శాఖాపరమైన తప్పిదాలపై ఆ విభాగానికి చెందిన తొమ్మిది మంది అధికారులు, ఉద్యోగులకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెం ట్ తాజాగా నోటీసులు జారీ చేసినట్టు తెలిసిం ది. వేములవాడ భీమేశ్వరాలయంలో ఆగస్టు 17న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం తొమ్మిది గంటలపాటు విస్తృత తనిఖీలు చేసి, పలు తప్పిదాలను గుర్తించి, రికార్డులను స్వా ధీనం చేసుకున్నది. 2024 నుంచి ఇప్పటివరకు స్వామివారికి బకాయి పడిన నగదు వసూళ్లలో జాప్యం, ఒకేసారి మూడేండ్ల అద్దె ను కొనసాగించడం, బినామీల పేరిట వచ్చినవారికి అద్దె దుకాణాలను కేటాయించినట్టు గుర్తించి ఆ విభాగానికి చెందిన ఏఈవో నుంచి పర్యవేక్షకులు, జూనియర్ అసిస్టెంట్ వరకు తొమ్మిది మంది ఉద్యోగులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
ఇందులో ఇప్పటికే బదిలీ అయిన యాదగిరిగుట్ట ఉద్యోగులతోపాటు రిటైర్ అయిన వారు కూడా హాజరుకావాలని ఆదేశించడం ఆలయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది. గురువారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందు అధికారు లు, ఉద్యోగులు హాజరుకానున్నట్టు తెలిసిం ది. అద్దె పొందిన దుకాణాల యజమానుల గడువు వచ్చే జనవరి 2027 నాటికి ముగుస్తుండటం, నేటికీ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా నష్టం చేకూరుతున్నట్టుగా విజిలెన్స్ శాఖ భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఒకేసారి తొమ్మిది మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

