నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానలో ఔట్‌పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్ సమయాన్ని పొడిగించారు. ప్రస్తుతం ఓపీ రిజిస్ట్రేషన్లు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉండగా.. ఇప్పుడు మధ్యాహ్నం 2.00 గంటల వరకు పొడిగించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఈ పెంపు వెసులుబాటు కల్పించనుంది. ఓపీ రిజిస్ట్రేషన్ సమయం పెంపుతో ఆ మేరకు వైద్యులు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండనున్నారు.
- మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానలో ఔట్‌పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్ సమయాన్ని పొడిగించారు. ప్రస్తుతం ఓపీ రిజిస్ట్రేషన్లు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉండగా.. ఇప్పుడు మధ్యాహ్నం 2.00 గంటల వరకు పొడిగించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఈ పెంపు వెసులుబాటు కల్పించనుంది. ఓపీ రిజిస్ట్రేషన్ సమయం పెంపుతో ఆ మేరకు వైద్యులు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండనున్నారు. కొన్ని కీలకమైన వైద్య పరీక్షల నివేదికలకు, స్పెషలిస్టుల అపాయింట్మెంట్ కోసం నిరీక్షణకు సైతం అధికారులు చెక్ పెట్టారు. ఓపీలో రిజిస్ట్రేషన్ అయిన రోజే ఎంఆర్ఐ మినహా ఇతర అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేశారు. దీంతో వాటి నివేదికలు సైతం ఒకటి రెండు గంటల్లోనే రావడంతో అదే రోజు వాటిని వైద్యులకు చూపించి, చికిత్స పొందే వెసులుబాటు లభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

