హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ డీజీపీ జితేందర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడి మరణాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి గురువారం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తన భార్యతో ఉన్న గొడవల నేపథ్యంలో ఆ టోడ్రైవర్ గత మే 13న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
పోలీసులు మొ దట దంపతులిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత బాధిత యువకుడిని ప్రత్యేక సెల్‌లోకి తీసుకెళ్లి లాఠీలు, బెల్టులతో తీవ్రంగా కొట్టారని బాధిత కుటుంబీకు లు చెప్పారు. ఆ తర్వాత అతను స్టేషన్ నుంచి బయటకు రావడంతోనే వాంతు లు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు దగ్గరలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మే 14న మీడియాలో వచ్చిన కథనాలు, వార్తల ఆధారంగా జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిజాలు నిగ్గు తేల్చేందుకు డీజీపీ జితేందర్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది.