హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : బ్లాక్‌చైన్ టెక్నాలజీ (ఫ్యూచర్ స్కిల్స్ కోసం) అనే నూతన కోర్సును కొత్తగా జేఎన్టీయూహెచ్లో ప్రవేశపెట్టినట్టు వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. ప్రస్తుతం బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సుకు డిమాండ్ ఉన్నదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా లభిస్తున్నాయని వెల్లడించారు.
ఈ కోర్సులో చేరేందుకు బీటెక్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు ఎంటెక్, ఎంసీఏ చదివినవారు అర్హులని ప్రకటించారు. ఇంటెర్న్షిప్/అప్రెంటిస్‌షిప్ ఫ్యాకల్టీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్(నాన్-ఐటీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కూడా బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ప్రవేశాలు పొందవచ్చని చెప్పారు. ఈ కోర్సు పూర్తిగా ఆన్లైన్ లేదా సెల్ఫ్-పేస్డ్ లెర్నింగ్ విధానంలో ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు రిజిస్ట్రేషన్, సిలబస్ ఇతర వివరాలకు జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.