న్యూఢిల్లీ, జూన్ 17: ఉద్యోగ అన్వేషణలో ఉపయోగపడేలా లింక్డిన్ కొత్త ఏఐ టూల్స్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు తోడ్పడేలా, ప్రక్రియను మరింత సులభతరం చేసేలా ఏఐ సాధనాల్ని ‘లింక్డిన్’ రూపొందించింది. ఉద్యోగానికి ఎంపికయ్యేలా రెజ్యూమ్, దరఖాస్తులోని ఏయే స్కిల్స్‌ను హైలైట్ చేయాలో తెలియజేస్తుంది. లింక్డిన్లో కావాల్సిన జాబ్ పోస్టింగ్స్‌ను వెతకటం కోసం ఇప్పటివరకు వివిధ రకాల ఫిల్టర్స్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఇకపై ఆ అవసరం లేకుండా ఏఐ టూల్స్ యూజర్ల పనిని సులభతరం చేయనున్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్స్ ప్రీమియం సబ్‌స్ర్కైబర్లు మాత్రమే పొందనున్నారు.