Telangana | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను స్వరపర్చిన విధానంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లుగా పాడుకుంటున్న పాట ట్యూన్‌ను మార్చేయడంతో ‘తెలంగాణ ఆత్మ’ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది రాష్ట్ర గీతమా? తెలంగాణ ప్రజల మనసులకు చేస్తున్న గాయమా?’ అని దుమ్మెత్తిపోస్తున్నారు.
పాతపాటే బాగుండేదని, కొత్త పాటను ఖూనీ చేశారని మండిపడుతున్నారు. వాస్తవానికి జయజయహే తెలంగాణకు సంగీతం అందించే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి పిలిచిమరీ కీరవాణికి అప్పగించినప్పటి నుంచే తెలంగాణలో వ్యతిరేకత మొదలైంది. ‘స్వరాష్ట్రంలో మన గీతానికి సంగీతం అందించేవారే కరువయ్యారా?’ అంటూ తెలంగాణ సమాజం నిలదీసింది.
దీనికితోడు.. ‘కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుడు ఎవరైనా ఉన్నాడా?’ అని సాక్షాత్తు గేయ రచయిత అందెశ్రీ అనటంతో ఈ ఆవేదన తారస్థాయికి చేరింది. తీరా.. అంచనాలను అందుకోవటం లో గీతం విఫలమైంది. దీంతో తమ మనసు లు గాయపడ్డాయంటూ నెటిజన్లు నిరసన వ్య క్తం చేస్తున్నారు. ‘కొత్త పాట కంటే పాత పాటే బాగుండె’ అని ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్టా, థ్రెడ్ వేదికలపై నిరసన కామెంట్లు పెడుతున్నారు.
తెలంగాణ సోయికి ‘ఆస్కార’ం లేని పాట
రాష్ట్ర గీతం తెలంగాణ సోయికి ‘ఆస్కార’ం లేని పాటగా మిగిలిపోయిందని నెటిజన్లు మం డిపడుతున్నారు. ‘విక్రమారుడు మూవీలో ఫ్లాష్‌బ్యాక్‌లో పోలీస్ రవితేజ ఎంట్రీ సీన్, మగధీర మూవీలో ‘నిన్ను పొందేటందుకే’ అ నే పాట మధ్యలో బీజీఎమ్, ఖలేజా మూవీ లో ఓం నమః శివ రుద్రయా’ అనేపాట, బా హుబలి మూవీలో ‘ఎవ్వడంట ఎవ్వడంట ని న్ను ఎత్తుకుంది’ అనే పాటలోని సంగీతాన్ని మిక్స్ చేసి విడుదల చేసిన పాట ఇది.
దీనికి కీరవాణి అవసరమా?’ అంటూ సుబ్బు నందిమళ్ల అనే నెటిజన్ ఫేస్బుక్ వేదికగా కామెంట్ చేశాడు. ‘చకటి పదాల పొందికతో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిన గీతాన్ని ఖూనీ చేశారు. తెలంగాణ గీతం అంటే సినిమా పాట కాదు. తెలంగాణ అంటేనే ఒక ధికార స్వరం, ఒక ఉద్యమ శిఖరం, ఉవ్వెత్తున ఎగిసిన సమరం. మలిదశ ఉద్యమం ప్రారంభమయ్యాక 15 ఏండ్ల నుంచి పాడుకుంటున్న ‘జయ జయహే తెలంగాణ గేయం’ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది.
అంధకారంలో చికుకున్న అందెశ్రీ ఈ తెలంగాణ గేయానికి చేసిన గాయం తెలంగాణ ప్రజల మనసును బాధించింది’ అంటూ రాజోజీ సాయిరామ్ చారి అనే నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కామెంట్లను ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు ఓసారి చదవాలని జ్యోతిష్య సత్యం అనే నెటిజన్ సూచించారు. ‘అసలు ఈ కామెంట్లు చూసైనా కాంగ్రెస్‌వాళ్లు మారండి. మీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి సలహాలు ఇచ్చే వారితో పూర్తిగా పాలన చెడిపోతున్నది.
ప్రజలందరితో ఛీతారానికి గురవుతున్నారు. వారిని వీలైనంత తొందరగా పకకుపెట్టాలి. మళ్లీ ముఖ్యమంత్రి దగ్గరకు రానీయకుండా చూసుకోండి. పిచ్చి పిచ్చి సలహాలతో తుగ్లక్ పరిపాలనలా అవుతుంది. ఉన్నవి తీసేస్తూ ఏవో పిచ్చివి పెడుతూ పిచ్చిపిచ్చిగా అవుతుంది. కీరవాణి సంగీతం బాగా లేదు. దాన్ని పూర్తిగా స్లో మోషన్లో పా డించిన విధానం బాగా లేదు. మీరు ఈ పాట పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది నెగెటివ్ కామెంట్స్ చేశారో చూడండి. అందరూ బీఆర్ఎస్ పార్టీ అనుకొంటే తప్పు. ఏ పార్టీకి పూర్తిగా చెందకపోయినా (నేను బీజేపీ అభిమానిని) ఉన్న వాస్తవం చెప్తున్నానన్నది గ్రహించాలి’ అంటూ సుదీర్ఘంగా తన ఆవేదన వెళ్లగక్కారు.
బరాబర్ అడుగుతాం
‘కీరవాణిని అహో ఓహో ఆని సమర్థించినవారు ఒకసారి ఆ పాట అనబడేది ఒకసారి విన్నారా? విని ఇప్పుడు ఆనందించండి’ అంటూ కోవెల సంతోష్‌కుమార్ అనే నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందెశ్రీ స్పష్టంగానే అన్నారు.. ఎకడ ఎలా ఒకరితో అయినా అన్నా అన్నట్టే. కచ్చితంగా అడుగుతం.. కాళేశ్వరం మీద కేసీఆర్‌కు, రాష్ట్ర గీతం మీద రేవంత్‌కు గంపగుత్తా హకు లేదు. కాళేశ్వరానికీ.. ఈ పాటకూ సంబంధం లేదు.
ఇది ఈ ప్రాంత కళాకారులను నీచంగా, హేయంగా.. అన్నింటికీ దిగజారి తిట్టిన సందర్భం. కచ్చితంగా అడుగుతాం. ఆసార్ అవార్డు అందుకున్న ఆయనకు కచ్చితంగా ఈ ప్రాంత భావోద్వేగంపై ఏమాత్రం అవగాహన లేదు.. రాదు. అది ఇప్పుడు తేలిపోయింది కూడా. కచ్చితంగా ప్రాంతాలను బట్టి ఉద్యమాలను బట్టి, వాటిలో ఉద్వేగాలను బట్టి మాత్రమే సంగీతంలో చైతన్యం ప్రస్ఫుటీకరిస్తుంది. ఇకడి వాళ్లను తిట్టినప్పుడు కచ్చితంగా ప్రశ్నించాల్సి వస్తుంది.
నూతన గీతంపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌లో 99 శాతం ఆవేదన, నిరసన తెలుపుతూ వచ్చేవే. మిగిలిన ఒక శాతం డైహార్డ్ కాంగ్రెస్ అభిమానులు పెడుతున్నవే. అవి కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడి యా పేజీల్లోనే. అయితే.. కాంగ్రెస్ సోషల్ మీడియా పేజీల్లో కూడా నూతన గీతంపై పెడుతున్న కామెంట్స్ దారుణంగా ఉన్నాయి.
కులాల పేర్లు ఎందుకు తీసేశారు?
ఉద్యమ సమయంలో రాసిన గేయంలో బీ సీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల్లో కొందరి పేర్లు ఉండేవని మందకృష్ణ మాదిగ పేర్కొన్నా రు. కొత్త పాటలో కులాల పేర్లే మర్చిపోయార ని విమర్శించారు. బహూశా రెడ్డి సామాజిక వ ర్గం లేకపోవటంతో ఆయన ఆదేశించి ఉం టా డు.. ఈయన తీసేసి ఉంటారు’ అని ఎద్దేవా చేశారు.
గుర్తింపు లేనిదే విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో ఎలా ఉన్నది? కేసీఆర్ ఎప్పుడో ఈ పాటను పాఠ్య పుస్తకాలలో ముద్రించారు. కొన్ని మార్పులు చేస్తాం అంటే అప్పుడు ఒప్పుకోని అద్దెశ్రీ ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడు? ఈ పాటలోనే ఉన్నది.. ‘కవిగాయక_వైతాళిక_కలల_మంజీరాలు జాతిని_జాగృతం_పరిచే_గీతాల_జన జాతర’ అని రాసిన వ్యక్తి ఈ రోజు తెలంగాణలో అసలు పాటలు పాడేవారు లేరు అంటున్నడు.
అంటే పాట తప్పుగా రాశాడా లేక అతని ఆలోచనలు తప్పా? అసలు జై తెలంగాణ అంటే గొంతులో గాంభీర్యం ఉండాలి. కానీ ఇప్పుడు పాడిన పాటలో అది ఒక రొమాంటిక్ పాటలా ఉన్నది. మన వాళ్లు అయితే మన యాసలో ఏ పదం ఎలా పాడాలి? అని బాగా తెలుస్తుంది. సినిమా పాటలు పడేవారిని పాడిస్తే ఇలానే ఉంటుంది.
– వరుణ్‌రాజ్ బాగం
ఆత్మగౌరవపు కర్రుకు కృత్రిమ అద్దె వెలుగులు సరితూగవు!
లక్షమంది కీరవాణిలు వచ్చినా సరే ఈ పాటను రీక్రియేట్ చేయలేరు. ఎందుకంటే.. సరిగమలు, గమకాలు, తాళాలు, రాగాలతో అల్లిన పాట కాదిది. కోట్లాది తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు.. సాహిత్యమై! ఏకోన్ముఖ పోరాటంలో చేయిచేయి కలిపిన ప్రతి తెలంగాణ గుండె చప్పుళ్లే సంగీతమై! ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలంతా గుండెలకు హత్తుకున్న వెచ్చదనంతో, చల్లారిన నెత్తురులో ఆత్మగౌరవపు బడబాగ్నులు రగిలించిన భావోద్వేగ సునామీ అది. కిరాయి గళాలకో.. పరాయి వాయిద్యాలకో.. అంతటి ఆరాటపు పదునెకడిది. ఆసార్ ఆర్భాటాలు కాదు.. తెలంగాణతనపు వాడిదనాన్ని ఆవిషరించే ఆసారం కదా కావాల్సింది.
– అజయ్ కుమార్ కోదం
పగోడితో పంచాంగం చెప్పిచ్చుకున్నట్టే ఉన్నది. ఓ ఫీల్ లేదు, పాడూలేదు. ఎంతచక్కటి పాటను ఆగం చేస్తిరి
– మహేశ్వర్ గౌడ్ సాబ్ కొత్త
ఇప్పుడు వదిలిన జయ జయహే తెలంగాణ పాట కంటే, జయము జయము చంద్రన్న పాటే నయం అన్పిస్తుంది.
– గణేశ్ రేగట్ట
కీరవాణి రాగంలో వణికిందొక హృదయం
– నరేషుమార్ సూఫీ
ఆంధ్రోడు సమకూర్చితే కానీ తెలంగాణ అధికార గీతం రూపు దిద్దుకోలేని చేతగాని వారు మీరు మాతో పోటీనా? అనే విమర్శలకు అందెశ్రీ కారకుడయ్యడు. సంగీత దర్శకుడికి మాత్రం మంచి అవకాశం. కీరవాణి చరిత్రకెకాడు. పాపం తెలంగాణ మళ్లీ ఎకిరింపుల పాలు కానున్నది.
– చంద్రమౌళి రామ్‌దేని
పాత రాగం వద్దనుకొని.. కొత్త రోగం తెచ్చుకున్నైట్లెంది. పాపం! అందెశ్రీ.. తాను కూడా పాడలేనట్టుగా పాటను మార్చిపారేశాడు. కీరవాణి బాహుబలి బీజీఎంలో జంపర్లు.. రాజన్న సినిమా పాట బీజీఎంలను కలగలిపి కానిచ్చేశాడు. మొత్తానికి బిర్యానీ కాస్తా… పులావ్ అయిందన్నమాట
– అన్నోన్ నెటిజన్
ఏం కీరవాణి ప్రాణం పెట్టి ట్యూన్ చేయలేదా? అతనికి భావోద్వేగం రాలేదా? కనీసం అందరికీ అర్థమయ్యే భాష కూడా రాయని జాతి గీతానికి ఇంత విలువ దకటం వల్ల ఉద్వేగమేమో! ఇతని రాత కన్నా అప్పట్లో రాసిన శంకరంబాడి సుందరచారి ఎంతో బెటర్. ఆయన భావంలో ఫ్యూడలిజం ఉన్నా, కనీసం భాషలోనైనా ఆధునికంగా నిలబడ్డాడు!
– సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్
జయ జయహే తెలంగాణ పాట బ్రాహ్మణీయ వెర్షన్ బాగుంది.
– అభినవ్ బూరం
మొన్నటి వరకు ఆ పాటను పాడుకుంటుంటే మన పాటలాగా అనిపించేది. ఇప్పుడు మనది అనే ఫీల్ రావడం లేదు.
– ప్రభాకర్ లక్కం
అందెశ్రీ.. నీ బాంచెన్ గా కీరవాణి పాట మహఘోరంరా నాయనా. నీ కాల్మొకుతా… గా ట్యూన్ వద్దని సరారోడికి చెప్పు. కనీసం నువ్వు పాడిందే ఉంచు.. లేకుంటే రామకృష్ణ పాడింది లేదా తెలంగాణ ట్యూన్ అని యూట్యూబ్‌లో ఇంకెవరో స్వరపరచింది. ఆ పాట మహాబాగుంది.. దాన్ని ఉంచుమను. ఆత్మలేని పాట ఎవడికి కావాలె? నీ గుండె నింపినది కావాలె కదా. ఓ అందెశ్రీ.. నీ బాంచెన్.. ఒద్దురా నాయనా .. మాకా కొత్త ఉత్త పాట ఒద్దుకాక ఒద్దు.
– యార్లగడ్డ రాఘవేంద్రరావు