అమిమ్కో జాతీయ డైరెక్టర్‌కు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక
హైదరాబాద్, మార్చి 28 : వికలాంగుల పరికరాల తయారీ కంపెనీ సౌత్ రీజినల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అలిమ్ కో (ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ డైరెక్టర్ ఉమేశ్ జిలానీని అఖిలభారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు కోరారు. సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఉమేశ్ జిలానీతో నాగేశ్వరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది.