హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రత్యేక ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నవీన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా రవిప్రదీప్ పులుసుతోపాటు 15 మంది కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రత్యేక అతిథిగా హాజరై కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు. ఈసారి కూడా ఎన్నారైలు క్రియాశీలక పాత్ర పోషించాలని అడ్వైజరీ వైస్ చైర్మన్ సికా చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు.
ఎన్నారై యూకే శాఖ సోషల్ మీడియాలో ప్రముఖ పాత్ర పోషించాలని నవీన్‌రెడ్డి, రవిప్రదీప్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని, ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు వెంకట్‌రెడ్డి దొంతుల, హరి నవాపేట్, వినయ్ ఆకుల, రవి రేతినేని, శ్రీకాంత్ జెల్లా, సురేశ్ బుడగం, గొట్టెముకల సతీశ్‌రెడ్డి, సేరు సంజయ్, సత్యపాల్‌రెడ్డి పింగళి, రమేశ్ ఎసెంపల్లి, సృజన్‌రెడ్డి, నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ మామిడాల, ప్రశాంత్ కటికనేని, పృథ్వీ, ప్రశాంత్, మధు, రామకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.