హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. నవీన్ కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తీన్మార్ మల్లన్న కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.