నాటు కోళ్ల రుణాలకు డిమాండ్
స్త్రీనిధి సంస్థ ఈ సంవత్సరం 20 వేల నాటు కోళ్ల పెంపకం యూనిట్లకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆరు నెలల్లో 15,606 (78%) యూనిట్లకు రుణాన్ని అందించింది. దీంతో అదనంగా మరో 15వేల యూనిట్లకు కూడా రుణం ఇవ్వడానికి స్త్రీనిధి సంస్థ సిద్ధమైంది. వచ్చే ఆరు నెలల్లో మరో 15 వేలకు పైగా యూనిట్ల పంపిణీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 50 కోళ్ల యూనిట్‌కు రూ.12,250లు, 100 కోళ్ల యూనిట్‌కు రూ.22వేల రుణాన్ని అందిస్తున్నారు
- ఆరు నెలల్లోనే 15 వేల యూనిట్లకు పెట్టుబడి
- మరో 15 వేల యూనిట్ల రుణాలకు స్త్రీనిధి సిద్ధం
స్త్రీనిధి సంస్థ ఈ సంవత్సరం 20 వేల నాటు కోళ్ల పెంపకం యూనిట్లకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆరు నెలల్లో 15,606 (78%) యూనిట్లకు రుణాన్ని అందించింది. దీంతో అదనంగా మరో 15వేల యూనిట్లకు కూడా రుణం ఇవ్వడానికి స్త్రీనిధి సంస్థ సిద్ధమైంది. వచ్చే ఆరు నెలల్లో మరో 15 వేలకు పైగా యూనిట్ల పంపిణీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 50 కోళ్ల యూనిట్‌కు రూ.12,250లు, 100 కోళ్ల యూనిట్‌కు రూ.22వేల రుణాన్ని అందిస్తున్నారు. 50 కోళ్ల కంటే 100 కోళ్ల యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవడానికే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా నెలకు రూ.1850 వరకు లాభం వస్తుందని అంచనా వేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నాటు కోడి మాంసానికి నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నది. ఫారం కోళ్ల కన్నా పెరటికోళ్ల పెంపకం ఎక్కువగా లాభదాయకంగా ఉండటంతో గ్రామీణులు వాటి పట్ల మొగ్గుచూపుతున్నారు. స్త్రీనిధి సంస్థ నుంచి రుణాలు తీసుకొని పెరటి కోళ్లు పెంచేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ముందుకొస్తున్నారు. ఇంటి దగ్గరే పెంచుకోవడం, పెట్టుబడికి కావాల్సిన రుణం లభిస్తుండటంతో మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్యాని కంటే అధికంగా రుణాల కోసం ఒత్తిడి వస్తున్నదని అధికారులు చెప్తున్నారు. బాయిలర్ కోళ్ల కంటే రుచిగా ఉండటం, ధర కూడా కొద్దిగా అటూ ఇటుగా ఉండటంతో పెరటి కోళ్లను తినడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇవి అధిక రోగ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. కొద్ది రోజుల్లోనే అమ్మకానికి అవసరమైన స్థాయిలో పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వీటిని పెంచడానికి మహిళా సంఘాల సభ్యులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నిజామాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా యూనిట్లు ఏర్పాటయ్యాయి. తీసుకున్న రుణాన్ని రెండు సంవత్సరాల్లో 11 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
మదర్ యూనిట్లు…
కోళ్ల యూనిట్లకు డిమాండ్ పెరగడంతో మదర్ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. మదర్ యూనిట్లు కూడా విరివిరిగా సమీప ప్రాంతంలోనే అందుబాటులో ఉండటం వల్ల పిల్లలను తెచ్చుకొనేందుకు వీలుగా మదర్ యూనిట్లకు కూడా రుణాలు అందిస్తున్నారు. అయితే మదర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి శిక్షణ తీసుకున్న వారికి మాత్రమే రుణాన్ని ఇస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

