హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఏఐ) ఆధ్వర్యంలో ఈ నెల 7,8న ఫైర్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ అండ్ అడోమేషన్ (ఎఫ్ఈఎస్ఏ)పై జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్టు ఎఫ్ఎస్ఏఐ జాతీయ అధ్యక్షడు శ్రీనివాస్ వల్లూరి పేర్కొన్నారు. గ్రీన్ల్యాండ్స్లోని హోటల్ప్లాజాలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎఫ్ఎస్ఏఐ దేశవ్యాప్తంగా అగ్నిభద్రత, జీవరక్షణ, ఆస్తుల పరిరక్షణ, నష్టనివారణ చర్యలపై 22 ఏండ్లుగా సేవలందిస్తున్నట్టు గుర్తుచేశారు. దేశవ్యాప్తం గా 25 చాప్టర్స్లో 10వేల మంది సభ్యులున్నట్టు తెలిపారు. ఆగ్నేయాసియాలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రం గా ఉందని, ఇటీవల పరిశ్రమల్లో అనేక అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నందున ఈ సెమినార్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.