కర్నల్ సంతోష్‌బాబుకు ఎన్ఎండీసీ నివాళి
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఇంటింటిపై జెండా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్ఎండీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి మహావీర్ చక్ర అవార్డు గ్రహీత కర్నల్ సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంతోష్‌బాబు చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎండీసీ డైరెక్టర్లు అమిత్వ ముఖర్జీ, సీవీవో విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నట్లు అసిస్టెంట్ పోస్టల్ డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి 20 అంగుళాల పరిమాణంలో ఉన్న జాతీయ జెండాకు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.