ఇంటింటా తిరంగా.. ఘనంగా
రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు.
- ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి
- కోటి 20 లక్షల జాతీయ పతాకాల పంపిణీ
- స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం
- రాష్ట్రమంతా ఏకకాలంలో జాతీయ గీతాలాపన
- వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
- ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కే కేశవరావు
- రవీంద్రభారతిలో వేడుకల లోగో ఆవిష్కరణ
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ జాతీయ పతాకాలను పంపిణీ చేయనున్నామని, ఇప్పటికే కోటి 20 లక్షల జెండాలను సిద్ధం చేయిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన
వజ్రోత్సవ వేడుకల లోగోను కమిటీ సభ్యులతో కలిసి కే కేశవరావు రవీంద్రభారతిలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 8న వేడుకలు ప్రారంభమవుతాయని, 22న ఎల్బీ స్టేడియం వేదికగా ముగుస్తాయని చెప్పారు. ఈ వేడుకల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
గాంధీ చిత్ర ప్రదర్శనలు.. తిరంగా రక్షా బంధన్‌లు
గాంధీ సినిమాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 15రోజుల పాటు ప్రదర్శించాలని నిర్ణయించినట్టు కేకే తెలిపారు. అదేవిధంగా వ్యాప్తంగా చారిత్రక ప్రదేశాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేయాలని, వాటి ఔన్నత్యాన్ని తెలిపే విధంగా డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షా బంధన్ వేడుకలను సైతం జాతీయ స్ఫూర్తితో నిర్వహించుకోవాలని, అందుకు మూడు రంగుల రాఖీలను వినియోగించుకోవాలని కోరారు. జాతీయ పతాకం లోగోతోనే అన్ని ప్రభుత్వ లెటర్‌హెడ్స్ ఉండాలని చెప్పారు. రవీంద్రభారతిలో 15రోజుల పాటు సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఫ్రీడం పోటీలను ఏర్పాటు చేయనున్నామని, ఏఆర్ రెహమాన్, జేసుదాసుతో మ్యూజికల్ నైట్ నిర్వహించాలని యోచిస్తున్నామని వెల్లడించారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని అన్ని కళా రంగాల్లో ఉత్తములను, అత్యుత్తమ సేవలను సంస్థలను గుర్తించి అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
21న అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశం
వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించనున్నామని కేకే ఈ సందర్భంగా వెల్లడించారు. 75 మంది కళాకారులతో.. 75 ముఖ్యమైన సంఘటనలపై చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక ఈ నెల 21న ప్రత్యేకంగా శాసనసభ, శాసనమండలి సంయుక్తంగా సమావేశం కానున్నాయని, దేశాభివృద్ధిపై పలు ప్రత్యేక తీర్మానాలు చేయనున్నాయని తెలిపారు. రాష్ట్రమంతటా ఏకకాలంలో జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. నిర్దేశిత తేదీన, సమయంలో ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలాపించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా 2కే రన్‌ను నిర్వహించనున్నామని, జానపద పండుగలు.. ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. వరంగల్ జైలును ఓపెన్ జైలుగా మార్చాలని సీఎం కేసీఆర్‌కు కమిటీ ప్రతిపాదించిందని చెప్పారు. సమావేశంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ కమిటీ సభ్యులు కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, మామిడి హరికృష్ణ, అధికారులు శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

