
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): యువ రచయితలను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో ఇటీవల కేంద్ర విద్యాశాఖ, నేషనల్ బుక్ ట్రస్టు (ఎన్బీటీ) సంయుక్తంగా నిర్వహించిన ప్రధానమంత్రి యువ మార్గదర్శకతా పథకానికి తెలుగు భాషా క్యాటగిరీలో ముగ్గురు ఎంపికయ్యారు. వీరిలో బోనగిరి సుకన్య, దేవరకొండ ప్రవీణ్‌కుమార్, కమ్మరి జ్ఞానేశ్వర్ ఉన్నట్టు నేషనల్ బుక్‌ట్రస్ట్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 23 భాషల నుంచి మొత్తం 75 మంది యువ రచయితలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నది. వీరిలో 37 మంది అమ్మాయిలు, 38 మంది అబ్బాయిలు ఉన్నట్టు వివరించింది. వీరికి నెలకు రూ.50 వేల చొప్పున ఆరు నెలల పాటు స్కాలర్షిప్ను అందజేయనున్నట్టు ఎన్బీటీ ఇండియా డైరెక్టర్ యువరాజ్ మాలిక్ తెలిపారు. జాతీయోద్యమంలో మరుగునపడిన అనేక సంఘటనలు, గుర్తింపునకు నోచుకోని వీరులు, మహిళానేతలు, ప్రాచుర్యంలోకి రాని ప్రదేశాల పాత్ర తదితర అంశాలపై పుస్తకాలు రాయించనున్నారు.
