హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యమివ్వాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం మేరకు ఉన్న బీసీలను కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి విస్మరిస్తున్నదని ఆదివారం ఓ ప్రకటనలో వాపోయారు. ఇకనైనా నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవుల్లో బీసీలకు 50% కేటాయించేలా చొరవ చూపాలని కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.