13 జాతీయ అవార్డులపై సీఎం కేసీఆర్ హర్షం
పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
- దేశమంతా పల్లెల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రమే 13 కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురసారాల్లోని 9 థీం ఆధారిత విభాగాల్లో తెలంగాణ రాష్ట్రమే 8 అవార్డులను సాధించడం విశేషమని సీఎం తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయితీరాజ్ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. పల్లెప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని సీఎం పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రతిఅంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్పూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధికోసం తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

