హైదరాబాద్ మే 13 (నమస్తే తెలంగాణ): నారాయణ ప్రభంజనం కొనసాగుతున్నది. ఇప్పటికే ఇంటర్మీడియెట్ ఫలితాల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థులు సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచారు. అత్యధిక బ్రాంచిల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతిలో ముగ్గురు 500కు 498 మార్కులు, 12వ తరగతిలో ఇద్దరు 500కు 498 మార్కులు, మరో ఇద్దరు 493 మార్కులు సాధించారు. 10వ తరగతిలో 17 మంది విద్యార్థులు 495కిపైగా మార్కులు, 111మంది 490కిపైగా మార్కులు, 12వ తరగతిలో ఇద్దరు 495 మార్కులు, 17మంది 490కి పైగా మార్కులు, 51మంది 485కిపైగా మార్కులు, 113 మంది 480కి పైగా మార్కులు సాధించినట్టు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పీ సింధూర నారాయణ తెలిపారు.
41 బ్రాంచీల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. పరీక్ష ఏదైనా నారాయణ విద్యాసంస్థల విజయ పరంపర కొనసాగుతున్నదని గుర్తు చేశారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల వల్లనే అద్భుత విజయాలు సాధిస్తున్నట్టు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర కే పునీత్ అభినందించారు.