హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అనుగు నరసింహారెడ్డిని రాష్ట్ర భాషా, సాం స్కృతిక శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జా రీచేసింది. ఫారెన్ సర్వీసెస్ కింద డిప్యూటేషన్ పద్ధతిలో రెండేండ్ల కాలపరిమితితో ఆయన్ను నియమించిన ట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
కొంతకాలంగా సెలవులో ఉన్న భాషా సాం స్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను తన సొంతశాఖ అయిన సహకార శాఖకు బదిలీ చేసింది. హరికృష్ణ సెలవులో ఉండడంతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైర్టెక్టర్ డాక్టర్ కే లక్ష్మి ప్రస్తుతం ఇన్చార్జి డైరెక్టర్‌గా కొనసాగుతుండగా, నరసింహారెడ్డి నియామకంతో ఆమెను ఇన్చార్జి బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
సుదీర్ఘకాలం డైరెక్టర్‌గా హరికృష్ణ
సహకారశాఖ అదనపు రిజిస్ట్రార్‌గా ఉన్న మామిడి హరికృష్ణ సుమారు 11ఏండ్లపాటు భాషా, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌గా కొనసాగడం విశేషం. కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడిగా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా సాహిత్యరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరికృష్ణను 2014, అక్టోబర్ 28న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భాషా, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌గా నియమించింది.