హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 2: ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తరచుగా స్థిరాస్తి ప్రదర్శనలు నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు తాజాగా మరో ప్రాపర్టీ షోకు తెర లేపాయి. హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో రెండ్రోజులపాటు కొనసాగే ఈ ప్రదర్శనను వరంగల్ మేయర్ గుండు సుధారాణి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, సొంత ఇంటిని సమకూర్చుకోవాలని ఎదురు చూస్తున్నవారికి ఈ ప్రాపర్టీ షో గొప్ప వేదిక అని అన్నారు. వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లు, ఇండ్లు, స్థలాలతోపాటు బ్యాంకు రుణాల గురించి తెలుసుకుని సులభంగా స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు ఈ ప్రదర్శనలోని స్టాళ్లు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు.
స్థిరాస్తి కొనుగోళ్లపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ప్రాపర్టీ షోలు ఎంతో దోహదపడుతున్నాయని డీఆర్డీవో శ్రీనివాస్ ప్రశంసించారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ మారపెల్లి సుధీర్‌కుమార్, పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌రావు, టీజీవో ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు, ఏవీ ఇన్ఫ్రాకాన్ సీఎండీ గోగుల లక్ష్మీవిజయ్కుమార్, బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ చైర్మన్ బిల్లా రమణారెడ్డి, ఎస్బీ డీజీఎం వివేక్ జైస్వాల్, ఎస్ఎన్ కన్స్ట్రక్షన్స్ ఎండీ ఎంఎస్ఎన్ మూర్తి, నేచర్ స్ప్రింగ్స్ సైట్ ఇంజినీర్ నాగరాజు, డీసీసీబీ సీఈవో మహ్మద్ వజీర్ సుల్తాన్, హరిహర పూర్ణోదయ బిల్డర్ కే ఉమాపతి, టీంలైన్ ఎకోసిటీ డైరెక్టర్ పాశం రమణారెడ్డి, డీసీసీబీ ఏజీఎం రాజశేఖర్, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్ కుమార్, ఎడిషన్ ఇన్చార్జి కనపర్తి రమేశ్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, అడ్వైర్టెజ్‌మెంట్ ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు, డిప్యూటీ మేనేజర్ అప్పని సూరయ్య తదితరులు పాల్గొన్నారు.