వికారాబాద్: పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారికి ఒత్తిడిని ఎలా జయించాలి, గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే సందేహాలు మదిలో మెదులుతుంటాయి. అలాంటి వాటిని ఛేదించి, విజయం సాధించేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో పరిగిలోని కొప్పుల శారద గార్డెన్-2లో అవగాహన సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ (హైదరాబాద్) డాక్టర్ సీఎస్ వేప వివిధ అంశాలపై ఉద్యోగార్థులకు అవగాహన కల్పిస్తారు. ఆత్మీయ అతిథులుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కే నిఖిల, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కింది లింక్ద్వారా యూట్యూబ్‌లో లైవ్‌గా వీక్షించవచ్చు..