హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఏపీలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు హైదరాబాద్లోని నల్సార్ వర్సిటీకి చెందిన భూమి హక్కుల కేంద్రం (సీటీఎల్ఆర్) న్యాయ సహాయం అందించనున్నది.
ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం నల్సార్తో ఒప్పందం చేసుకొన్నది. ఏపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే చేపట్టింది. రూ.వెయ్యి కోట్లతో మూడేండ్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను సర్వే చేసి కొత్త హక్కు పత్రాలు జారీ చేయాలని సంకల్పించింది.