పదవులు అనుభవించి ఇంటిపార్టీకి వెన్నుపోటు..
మీడియా సమావేశాల్లో టీఆర్ఎస్ నాయకులు
మంచిర్యాల టౌన్/చెన్నూర్ రూరల్/మందమర్రి, మే 19 : పదవులు అనుభవించి ఇంటిపార్టీకి వెన్నుపోటు పొడిచిన మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నల్లాల ఓదెలు, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి టీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని మంచిర్యాల జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య హెచ్చరించారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తనను బెదిరిస్తున్నారని, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు చెప్పినా పట్టించుకోలేదని విమర్శలు చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు చెన్నూరు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారని, విప్ పదవిని కట్టబెట్టారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న కారణంగా ఆయన భార్య భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారన్నారు. ‘ఎన్నోసార్లు నిన్ను, నీ కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం అనైతికం. సోనియాను తెలంగాణ బలిదేవత అన్న నీవు ఇప్పుడు ఎలా ఆ పార్టీలోకి వెళ్లావు’ అని ప్రశ్నించారు. ఆయన పార్టీ మారడం వల్ల పోయేది ఏమీ లేదని, ప్రజలంతా టీఆర్ఎస్ పక్షాన ఉన్నారని పేర్కొన్నారు.
కాగా చెన్నూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో చెన్నూర్ ఎంపీపీ మంత్రి బాపు, చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా మాట్లాడుతూ.. నల్లాల ఓదెలు ఓడిపోవడం ఖాయమని సర్వేలో తేలినందున సీఎం కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదన్నారు. ఇదే సమయంలో ఓదెలు భార్య నల్లాల భాగ్యలక్ష్మిని జడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇవన్నీ చేసిన టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం సిగ్గు చేటన్నారు. బాల్క సుమన్ దళితులను పట్టించుకోవడం లేదని, కార్యకర్తలను గుర్తించడం లేదని నల్లాల ఓదెలు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఓదెలకు ఇచ్చిన పదవులు..