Nakrekal: రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మతిభ్రమించింది.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కేతేపల్లి: అభివృద్ధి నిరోధకులు పీసీసీ, బీజేపీ రాష్ర్టాధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు మతిభ్రమించి సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమ ర్శించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు కు నోటు కేసులో, నకిలీ స్టాంపుల కుంభకోణంలో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. డ్రగ్స్ విషయంలో మంత్రి కేటీఆర్‌పై సవాల్ విసిరి వెనకడుగు వేసిన పిరికి వాడు రేవంత్ రెడ్డని ఎద్దేవా చేశారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రేవంత్‌రెడ్డి తన భాష తీరు, ప్రవర్తనను మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అదేవిధంగా బండి సంజయ్ పాదయాత్రతో ప్రజలకు ఒరిగేదే మి లేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తేలేని వ్యక్తి ఇక్కడ పాదయాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు.
కొత్త బిచ్చగాడు పొద్దెరగని రీతిలో ప్రతిపక్ష పార్టీల నాయకులున్నారని అన్నారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుపై బురద జల్లేందుకు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న దళితుల్లో అపోహలు సృష్టించి వారిని రెచ్ట గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండి పడ్డారు.
శాంతి మార్గంలో రాష్ర్టాన్ని సాధించి పెట్టిన సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి పై నాయకులకు లేదన్నారు. మరోమారు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో పార్టీ శ్రేణులు వారిని ప్రతిఘటించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచ కొండ శ్రీనివాస్‌గౌడ్, గుడివాడ సర్పంచ్ కట్టా శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండలా ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, సర్పంచ్ల ఫోరం మండలా ధ్యక్షుడు బడుగు ల శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

