Nagarjuna Sagar | నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు మూసివేత..
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విదుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసివేశారు.
Nagarjuna Sagar | నల్లగొండ : నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విదుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం వరకు క్రస్ట్ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు, కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల నీటిని వదిలారు. కాగా, నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలులు ఉన్నాయి.
సాగర్‌లో ఏపీ అధికారుల దౌర్జన్యం..
నాగార్జునసాగర్ డ్యామ్ పైనుంచి క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్రా అధికారులు ధ్వంసం చేశారు. క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి అనువుగా కొన్నేండ్ల క్రితం వాక్‌వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దానికి ఆంధ్రా, తెలంగాణ రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేయగా నిర్వహణ పూర్తిగా తెలంగాణ అధికారులు చేపడుతున్నారు. ఆదివారం ఆంధ్రాకు సంబంధించిన సుమారు 20 మంది అధికారులు ఏపీ సీఎం పేషీ నుంచి వచ్చారు. వాక్‌వే బ్రిడ్జి గేట్‌కు తాళం వేసి ఉండటంతో తెలంగాణ ఎన్నెస్పీ అధికారులను తాళం చెవి అడిగారు. దాంతో వారు కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆంధ్రా అధికారులు దౌర్జన్యంతో గేట్ తాళం పగులగొట్టి వాక్‌వే బ్రిడ్జి మీదికి వెళ్లిపోయారు.
13వ గేట్ వరకు తమ ఆధీనంలో ఉన్నదంటూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. డ్యామ్‌పై కంట్రోల్ రూమ్ 26వ గేట్ అవతల ఉన్నదని అక్కడికి వెళ్లి డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఉన్నతాధికారులకు పంపించినట్టు సమాచారం. ఈ ఘటనపై ఈఈ మల్లికార్జునరావును వివరణ కోరగా ఆంధ్రా అధికారులు తాళం పగులగొట్టిన విషయం తన దృష్టికి వచ్చిందన్నా రు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్య లు తీసుకుంటామని తెలిపారు. డ్యామ్‌పై పహారా కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా అనుమతిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
TG EAPCET | టీజీ ఎప్‌సెట్.. తుది విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
KTR | దళిత వాడలో వారం రోజులుగా నో కరెంట్.. డిప్యూటీ సీఎం గారూ జర చూడండి : కేటీఆర్
KTR | ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరినీ వదిలిపెట్టొద్దు.. కోల్‌కతా డాక్టర్ ఘటనపై కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

