బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 5: ఎయిడ్స్ రోగులకు పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహిస్త్తూ.. చికిత్సలో డ్రాప్ అవుట్ కాకుండా ఉత్తమ వైద్య సేవలను అందించినందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా దవాఖానలోని ఐసీటీసీ/పీపీటీసీటీ ల్యాబ్ జాతీయ స్థాయిలో ఎన్ఏబీఎల్ అక్రెడిటేషన్కు ఎంపికైందని దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని జిల్లా ఏరియా దవాఖానల విభాగంలో మొట్టమొదటి ఎన్ఏబీఎల్ ఎంట్రీ లెవల్ అక్రెడిటేషన్ పొందిన దవాఖానగా బాన్సువాడ ఏరియా దవాఖాన నిలిచిందని పేర్కొన్నారు.