బొల్లారం, ఏప్రిల్ 20: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువత ప్రణాళికబద్ధంగా చదివి విజయం సాధించాలని నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్‌జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్’ను బుధవారం కంటోన్మెంట్ తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్లో ఆయన ప్రారంభించారు.
సీపీ ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ రిక్రూట్మెంట్ శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నార్త్‌జోన్ పరిధిలో 1500 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.