ఏదీ… మళ్లీ ఒకసారి చెప్పు….మేము రమ్మంటేనే తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చావా? అని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కార్యకర్తలు నిలదీసినంత పని చేసారు. అసలు ఎవన్ని అడిగి బీజేపీలోకి పోయినవ్…ఇప్పుడు ఎవన్ని అడిగి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చినవ్? పై నుంచి మీరు రమ్మంటేనే వచ్చినని రువాబ్ ఒకటి… అంటూ చోటా మోటా నాయకులు కూడా ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోయారు. ‘అరే…ఏదైనా ఉంటే మనం… మనం మాట్లాడుకుందాం…గట్టిగా మాట్లాడకుండ్రా బై…గోడలకు చెవులుంటయ్. గిదిగిట్ల బీఆర్ఎస్ లీడర్ల చెవిల గనుక పడిందనుకో…నా బతుకు బస్టాండే’ అని రాజగోపాల్‌రెడ్డి పూర్తిగా తగ్గి కాళ్ల బేరానికి వచ్చారు.
ఏదో అప్పుడు పోవాలని అనిపించింది పోయిన…మళ్లీ రావాలని అనిపించింది వచ్చిన…వంద శాతం నాదే తప్పు… అయిందేదో అయింది…ఇక నేను ఎక్కడికి పోను. మీకు ఏమి కావాల్నో అడుగుండ్రి…తీసుకోండి. అంతేకానీ గప్పుడెందుకు పోయినవ్…ఇప్పుడెందుకు వచ్చినవ్ అనే మాటలు బంద్ చేయిండ్రి… అప్పుడు గిచ్చలేదా…కొట్టలేదా? అనే ముచ్చట్లు ఇక నుంచి నేను బంద్ జేస్తా…మీరు కూడా బంద్ జేయిండ్రి…సరేనా…! (ఎట్టకేలకు రాజీపడిన రాజ్‌గోపాల్‌రెడ్డి) .
– వెల్జాల