TSPSC | హైదరాబాద్ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 78 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 8వ తేదీన రాత పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 8వ తేదన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు హాల్టికెట్ వెనుక ఉన్న నిబంధనలన్నీ పాటించాలని పేర్కొన్నారు. వెబ్సైట్లో మాక్టెక్స్ లింక్ అందుబాటులో ఉన్నదని, అభ్యర్థులు పరీక్షకు ముందే ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.