ఇచ్చోడ, ఫిబ్రవరి 15 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి-సుభాష్ దంపతుల మనుమడికి మాజీ సీఎం కేసీఆర్ పేరును నామకరణం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. ముక్రా(కే) గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిపిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సదా రుణపడి ఉంటామని తెలిపారు. కేసీఆర్‌తోనే ముక్రా(కే) గ్రామం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలిచిందని కొనియాడారు. ఈ సందర్భంగా గాడ్గే వైష్ణవి-ధీరజ్‌కు జన్మించిన కుమారుడికి కేసీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని కేసీఆర్‌గా నామకరణం చేసినట్టు చెప్పారు. చివరి వరకు కేసీఆర్ వెంటే ఉంటామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని వారు పేర్కొన్నారు.