ఇచ్చోడ, జూలై 6: సమర్థవంతమైన నాయకత్వ పటిమ, బాధ్యతాయుతంగా పనిచేసి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) మహిళా తాజామాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచారని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ ట్విట్టర్(ఎక్స్)లో కొనియాడారు.
ముక్రా(కే) గ్రామ పంచాయతీకి చెందిన గాడ్గె మీనాక్షి నాయకత్వం, స్ఫూర్తి దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో ముక్రా(కే) గ్రామం దేశంలోనే ఆదర్శంగా తయారైందని ప్రశంసించారు. ఆ గ్రామంలో ప్రతి పథకం అమలవుతుందని, ప్రతి పల్లె ఈ గ్రామం మాదిరిగానే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముక్రా(కే) గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో వీడియోను పోస్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా అభినందించారు.