హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(మెపా) నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 17 శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరారు. చేపల వృత్తే జీవనాధారమైన ముదిరాజ్‌లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. తొలుత మర్యాదపూర్వకంగా మంత్రికి పెద్దమ్మతల్లి విగ్రహాన్ని అందజేశారు. మంత్రిని కలిసినవారిలో మెపా రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగట్టు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు పులి దేవేందర్, అల్లం వేణుమాధవ్, గుండ్ర చంద్రశేఖర్, మధుసూదన్, రమణ, ఉడుత మహేందర్, రాజు ఉన్నారు.