ఎంపీడీవో పోస్టులే 140
గ్రూప్ -1 పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులే ఉన్నాయి. మొత్తం 563 పోస్టుల్లో 140 ఎంపీడీవో పోస్టులుండగా, ఆ తర్వాత డీఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45 మాత్రమే ఉన్నాయి.
- ఆ తర్వాత అత్యధికంగా 115 డీఎస్పీ పోస్టులు
హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులే ఉన్నాయి. మొత్తం 563 పోస్టుల్లో 140 ఎంపీడీవో పోస్టులుండగా, ఆ తర్వాత డీఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45 మాత్రమే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు 41 ఉన్నాయి. అభ్యర్థులు వయోపరిమితి, విద్యార్హతల ఆధారంగా ఆయా పోస్టులకు అర్హులవుతారు. కొన్ని పోస్టులకు మాత్రం ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం కాగా వాటి వివరాలిలా ఉన్నాయి.
విద్యార్హతలు..
- రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీవో) ఉ ద్యోగాలకు బీటెక్ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఉద్యోగానికి డిగ్రీలో కామర్స్, ఎకనామిక్స్ లేదా గణితం సబ్జెక్టుల్లో కనీసం సెకండ్‌క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ వారు అర్హులే అయినా. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ స్పెషలైజేషన్‌తో సోషల్‌వర్క్ పీజీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యమిస్తారు.
- మిగతా అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు పోటీపడవచ్చు.
అడ్డంకిగా సివిల్స్
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు మే 26న జరగనున్నాయి. మెయిన్ సెప్టెంబర్‌లో జరుగనున్నది. గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను మే, జూన్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మెయిన్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహిస్తామని వెల్లడించింది. దీంతో అటు సివిల్స్‌కు.. ఇటు గ్రూప్ -1కు ప్రిపేరయ్యే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న వాదనలున్నాయి. రెండింటి సిలబస్ వేర్వేరుగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతాయని అభ్యర్థులంటున్నారు.

Pps
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Group 1
- MPDO
- MPDO posts
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

