TG EAPCET | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎప్‌సెట్‌లో భాగంగా ఎంపీసీ విద్యార్థులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 22 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ప్రవేశాల కమి టీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 23న ఆప్షన్లు ఫ్రీజ్ చేసుకోవచ్చు. 25న సీట్లు కేటాయిస్తారు.
వెయ్యి ఫైన్‌తో ఇంటర్ అడ్మిషన్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఫస్టియర్‌లో చేరేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. రూ.వెయ్యి ఫైన్‌తో బుధవారం(ఈనెల 17న) వరకు అడ్మిషన్లు పొందే అవకాశమిచ్చింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేవారు రు సుము చెల్లించాల్సిన అవసరం లేదు.