మొక్క నాటడం.. తల్లి ప్రేమ పొందడమే!
మొక్కలు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొనండి
- స్త్రీమూర్తులకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపు
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక పండ్ల మొక్కను నాటి 9000365000 సెల్ నంబర్‌కు సెల్పీ ఫొటోను పంపించాలని ఆదివారం విజ్ఞప్తిచేశారు. జీవితమంతా నిస్వార్థంగా ఫలాలను అందించే మొక్కలాగే.. ప్రతి మహిళా త్యాగాలతో కుటుంబాలను నిలబెడుతుందని, అచంచలమైన ప్రేమను కురిపిస్తుందని, ఈ స్ఫూర్తికి ప్రతిరూపంగా ప్రతి స్త్రీమూర్తి మొక్కను నాటి ఔనత్యాన్ని చాటాలని కోరారు. మొక్కలపెంపకాన్ని మనమంతా బాధ్యతగా స్వీకరించినప్పుడే పుడమి పచ్చగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున మహిళలంతా మొక్కలను నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పంచుకోవాలని సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

