హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుకుగా ఉండే రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. గిర్ వన్యప్రాణి సంరక్షణ పార్కులోని వన్యప్రాణుల ఫొటోలను సంతోష్‌కుమార్ ఆదివారం ట్విట్టర్లో పోస్టు చేశారు. పోస్టుకు అనుగుణంగా నెటిజన్లు రీ ట్వీట్లతో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎంపీ సంతోష్‌కుమార్ నిరంతర అన్వేషి అని, వన్యప్రాణులకు ప్రాణం పోద్దాం.. భావితరాలకు బాటలు వేద్దాం.. అంటూ పేర్కొన్నారు. వనాల నరికివేత వీడుదాం.. జగతికి పరిచయం చేసిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిగా.. మొక్కలు నాటి వన్యప్రాణులకు తోడ్పాటు నిద్దాం.. జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం… అంటూ ట్వీట్లతో ఫాలో అయ్యారు.